ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ జోడిని మళ్ళీ రిపీట్ చేయలని అనుకున్నాడు మిథున్ అనే కొత్త దర్శకుడు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ రూపొందబోయే ఈ చిత్రానికి ‘డ్యూయెట్’ అనే టైటిల్ అనుకున్నారు. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడిగా నటిస్తారని నిర్మాతలు కూడా ప్రకటించారు.
అయితే ఇప్పుడా జోడి కుదరడం లేదు. ఈ ప్రాజెక్ట్ లో వైష్ణవి చైతన్య నటించడం లేదు. ‘డ్యూయెట్’నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే బేబీ నిర్మాత ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ నిర్మాతలతో మూడు సినిమాలకు అగ్రీమెంట్ చేసుకుంది వైష్ణవి చైతన్య. బేబీకి ముందే ఈ అగ్రీమెంట్ జరిగింది. ఆ మూడు సినిమాలు పూర్తయితే గానీ మరో సినిమా చేయడానికి లేదు. అందుకే ఈ జోడి రిపీట్ కావడం కుదరలేదు. వైష్ణవి చైతన్య స్థానంలో రితిక నాయక్ ని తీసుకున్నారు. ఇంతకుముందు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చేసింది రితిక. ఇప్పుడిది రెండో సినిమా. ఈ గురువారం సినిమాని లాంచ్ చేస్తారు.