వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే వరల్డ్ కప్ నేపధ్యంలో వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్ 24న విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ వదిలారు. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ నిండిపోయింది.
హీరో క్యారెక్టర్ ని లైటర్ వెయిన్ లో పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలౌతుంది. వైష్ణవ్ తేజ్ కుటుంబం, తర్వాత రాధిక, సుదర్శన్ పాత్రల నేపధ్యంలో వచ్చిన సన్నివేశాలు నవ్వులు పంచాయి. తర్వాత హీరోయిన్ గా శ్రీలీల ట్రాక్ కూడా బావుంది. బేసిగ్గా హీరో, హీరోయిన్ వెంట పడతాడు. ఇందులో మాత్రం శ్రీలీలనే హీరోని పెంచుకుంటానని చెప్పడం సరదాగా వుంది.
తర్వాత ట్రైలర్ యాక్షన్ వైపు టర్న్ తీసుకుంది. హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో వైష్ణవ్ తేజ్ కొత్తగా కనిపించాడు. ఇప్పటివరకూ వైష్ణవ్ తేజ్ చేయని మాస్ పాత్ర ఇది. ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ కమర్షియల్ సినిమాలా అనిపించింది. జీవి ప్రకాష్ నేపధ్య సంగీతం మాస్ ఎలివేషన్ ఇచ్చింది. డడ్లీ కెమరాపని తనం కూడా కమర్షియల్ కొలతలకు సరిపోయేలా వుంది.
”రాముడు లంక మీద పడటం వినుంటావ్, అదే పదితలలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా” ఇది విలన్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్.
”నేను అయోధ్యలో వుండే రాముడ్ని కాదు.. ఆ రాముడు కొలిచే రుద్రకాలేశ్వరుడిని” ఇది హీరో చెప్పే డైలాగ్.
ఈ రెండు డైలాగులు బట్టి ఇందులో హీరో, విలన్ పోరాటం ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు.