గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు వైసీపీ తరపున నియోజకవర్గానికి ఎమ్మెల్యేలను..ఇన్‌చార్జ్‌ను తానేనని స్వయం ప్రకటన చేసుకున్నారు. అధికారికంగా వైసీపీలో చేరని ఆయన…ఇలా ప్రకటించుకోవడానికి కారణం ఉంది. వల్లభనేని వంశీకి వైసీపీ క్యాడర్ సపోర్ట్‌గా నిలవడం లేదు. టీడీపీ నుండి ఆయనతో పాటు వచ్చినవారితోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుండో వైసీపీ ఉన్న క్యాడర్ అంతా… దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వెనుక ఉన్నారు. వీరంతా..ఇప్పుడు ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు.
దుట్టా రామచంద్రరావు అల్లుడు రెడ్డి సామాజికవర్గం. ఆయన గన్నవరం సీటుపై కన్నేసి.. విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాను వైఎస్ కుటుంబానికి బంధువునని చెబుతూ..అధికారులతోనూ పనులు చేయించుకుంటున్నారు. దుట్టా రామచంద్రరావు కూడా.. వల్లభనేని వంశీతో కలసిపని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇటీవల బాపులపాడులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించేందుకు దుట్టా ఇంటికి వెళ్లిన వల్లభనేని వంశీకి నిరాదరణ ఎదురయింది.
మరో వైపు హైకమాండ్ నుంచి.. టీడీపీ ని.. చంద్రబాబును విమర్శించాలన్న సంకేతాలు వచ్చినప్పుడల్లా.. తన విధేయతను చాటుకోవడానికి చంద్రబాబును వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తున్నారు. అయినా యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా వర్గాల దూకుడు తగ్గడం లేదు. దీంతో…తానే గన్నవరం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను.. ఎమ్మెల్యేను స్వయంగా ప్రకటించుకోవాల్సి వస్తోంది. దుట్టా, యార్లగడ్డ వర్గాలతో కలిసి పని చేస్తామని వల్లభనేని చెబుతున్నారు కానీ వారు మాత్రం సిద్ధంగా లేరు.