గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం అందరికీ డౌట్ గా ఉంది. కౌంటింగ్ కోసం ఆయన ఇండియాకు వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు కుటుంబంపై అత్యంత ఘోరంగా మాట్లాడి.. టీడీపీ నేతల హిట్ లిస్ట్ లో చేరాడు వంశీ.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, ఓ సారి టెన్త్ విద్యార్థులతో లోకేష్ వీడియో కాల్ లో ఉన్నప్పుడు చొరబడటం వంటి వ్యవహారాలు చేశారు. ప్రభుత్వం మారితే ఆయన పరిస్థితి ఘోరంగా ఉంటుందన్న అనుమానం వంశీకి వచ్చింది. అందుకే ఎన్నికలు ముగియగానే అమెరికా వెళ్లారని చెబుతున్నారు. మరో ఆరు నెలల వరకూ ఆయన ఇండియాకు వచ్చే అవకాశం లేదన ిఅంటున్నారు.
ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని లేదని కానీ జగన్ బతిమాలితే చేశానని వంశీ చెప్పుకున్నారు ఎన్నికలు కూడా ఆసక్తి లేనట్లుగా నిర్వహించారు. పోలింగ్ రోజు హడావుడి చేయబోతే హెచ్చరికలు రావడంతో వెనక్కి తగ్గారు. టీడీపీ అభ్యర్థిపై ఓ చోట దాడి ప్రయత్నం జరిగితే.. తనకు సంబంధం లేదని అడగకపోయినా చెప్పుకున్నారు. మొత్తంగా చాలా మంది కౌంటింగ్ సెంటర్లకు వచ్చేందుకు.. కౌంటింగ్ రోజున ఏపీలో ఉండేందుకు కూడా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.