రాజకీయాల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు ఎంత దూరమైన వెళ్లేవారు ఉన్నారు. వైసీపీ హయాంలో ఈ పరిధి మరీ దాటిపోయింది. ప్రత్యర్ధులు మాత్రమే కాదు.. పార్టీ సానుభూతిపరులను కూడా వైరిపక్షంగా చేసుకొని నీచత్వానికి పాల్పడ్డారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీకి అనుకూల పోస్టులు పెడుతున్నారని ఓ ప్రవాసాంధ్రుడిపై కేసులు పెట్టి వేధించారు. అరెస్ట్ చేయించారు. సమాజంలో గౌరవంగా తలెత్తుకు బ్రతకకుండా చేయాలనుకున్నారు.
అతను ఒక గే అని, స్వలింగ సంపర్కుడు అని అతని ట్యాబ్ లో వందలకొద్ది అశ్లీల వీడియోలు ఉన్నాయని వ్యక్తిత్వ హననం చేయించారు. వంశీ ఆదేశాలతోనే పోలీసులు అతని వ్యక్తిత్వాన్ని కుళ్లబొడిచారు అనే విమర్శలు వచ్చాయి.
రాజకీయాల్లో ప్రతికూలురును అనుకూలంగా మార్చుకోవలనుకోవడం తప్పు ఏమాత్రం కాదు. కానీ, వంశీ జగన్ మెప్పు కోసం ఎంచుకున్న మార్గమే తప్పు. అదే ఇప్పుడు వంశీని క్యారెక్టర్ లెస్ గా నిలబెట్టింది.