జగన్ రెడ్డి అవినీతి చేయలేదని ఎవరూ చెప్పరు. అలా వాదించరు కూడా. అలాగే రఘురామను కొట్టలేదు అని వైసీపీ నేతలు కూడా చెప్పరు. బయటకు చెప్పినా ఫ్లోలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వైసీపీ తరపున వచ్చాడో.. వల్లభనేని వంశీ మాట్లాడుకున్నాడో కానీ చిరంజీవి అనే లాయర్ విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. వంశీ టీడీపీ టార్గెట్ అని ఆయనను రఘురామను కొట్టినట్లుగా కొడతారన్న భయంగా ఉందని చెప్పుకొచ్చారు. అంటే రఘురామను కస్టోడియల్ టార్చర్ చేశారని అందరూ నమ్ముతున్నారు. వీరికి రూఢీగా తెలిసి ఉంటుంది. ఇలాంటి ఫ్లోలో బయటపడుతూ ఉంటారు.
కస్టోడియల్ టార్చర్ చేస్తే రఘురామ బయట పెట్టరని .. పరువు పోతుందని గంభీరంగా ఉంటారని అనుకున్నారేమో కానీ.. చాలా తీవ్రంగా హింసించారు. ఆ హింసకు ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే అనారోగ్యం సాకు చెప్పవచ్చని ముందుగానే డాక్టర్ల టీంను కూడా రెడీ చేసుకున్నారు. ఆ సాక్ష్యాలన్నీ రికార్డుల్లో ఉన్నాయి. అయినా కొట్టలేదని తప్పుడు నివేదికలను డాక్టర్లతో ఇప్పించారు. ఇప్పుడు వారంతా అరెస్టు భయంతో దాక్కుని దాక్కుని సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు.
నిజంగా వల్లభనేని వంశీని అరెస్టు చేసి కొట్టాలనుకుంటే ఫలితాలు వచ్చిన మూడో రోజునే లోపలేసి కుమ్మేసి ఉండేవారు. అప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కూడా కాదు. గెలుపు ఊపులో .. ఆయన చేసిన నిర్వాకాలన్నీ గుర్తు చేసేవారు.కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదన్న కారణంతోనే న్యాయప్రక్రియను కొనసాగిస్తున్నారు. కానీ దాన్నే అలుసుగా తీసుకుని ఫిర్యాదుదారుడ్ని బెదిరించి .. కేసు విత్ డ్రా చేయిస్తే ఊరుకుంటారా ?