కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లినట్లుగా ఏపీ పోలీసులు గుర్తించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన పోలీసులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఆయన అమెరికా వెళ్లినట్లుగా నిర్ధారించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వంశీ రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. కూటమి సర్కార్ కొలువుదీరిన వెంటనే టీడీపీ కార్యాలయంపై దాడి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో వంశీ పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు. వంశీ అరెస్ట్ కూడా ఖాయమని ప్రచారం జరగడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
Also Read : లక్ష్మీపార్వతికి కూటమి సర్కార్ షాక్
దాడి ఘటనలో కీలకమైన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించడమే కాకుండా.. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను పెట్టించిన వంశీని ఎలా వదిలేస్తారని టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఇటీవల కృష్ణాజిల్లాకు కొత్త ఎస్పీ రావడంతో ఈ కేసులో మళ్లీ కదలిక మొదలైంది. పార్టీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉండటం.. ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని గుర్తించిన పోలీసులు వంశీ అరెస్ట్ కోసం మూడు బృందాలుగా హైదరాబాద్ వెళ్ళారు. కానీ, వంశీ అందుబాటులో లేకపోవడంతో అసలు విషయం కూపీ లాగగా.. ఆయన అమెరికా వెళ్ళినట్లుగా గుర్తించారు.