వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ రోడ్డెక్కారు. రాజకీయాలపై ఏమాత్రం అనుభవం లేని ఆమె తన భర్త కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ నుంచి కానీ, వంశీ మిత్రుల నుంచి కానీ సరైన రియాక్షన్ లేకపోవడంతో ఇక లాభం లేదనుకొని పంకజశ్రీ తనే రంగంలోకి దిగింది.
భర్తను బయటకు తీసుకొచ్చెందుకు ఆమె పోరాటం ప్రారంభించారు. కానీ, ఆమెకు మహిళల నుంచి ఏమాత్రం మద్దతు లేదు. ఎందుకంటే పరాయి మహిళల వ్యక్తిత్వం హననం చేసేలా వ్యాఖ్యలు చేసి, శిక్షార్హుడిగా మారిన వంశీకి సంఘీభావం తెలిపేందుకు మహిళా నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. దీంతో ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ కోసం, వైసీపీ కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడినా..ఇప్పుడు జగన్, వైసీపీ నుంచి పంకజశ్రీలో కనీసం ఆత్మస్థైర్యం నింపేలా చొరవ చూపడం లేదు. పైగా..నాడు ఓ మహిళపై నీచంగా వ్యాఖ్యలు చేసి రక్షాసానందం పొందిన వంశీ..ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతుండటంతో తన భార్యే తాజాగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచింది. కర్మ వదిలిపెట్టదు అంటే బహుశా ఇదేనేమో..