ఫ్లాష్ బ్యాక్‌: ఒకే ట్యూన్ రెండు పాట‌లు

ఇళ‌య‌రాజా – వంశీల‌ది అద్భుత‌మైన కాంబినేష‌న్‌. వీళ్ల సినిమాల్లో పాట‌లంటే ఇప్ప‌టికీ చెవులు కోసేసుకొంటారు సంగీత ప్రియులు. ఈ కాంబినేష‌న్‌లో ‘అన్వేష‌ణ‌’ అనే సినిమా వ‌చ్చింది. సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. థ్రిల్ల‌ర్ చిత్రాల్లో అదో మైల్ స్టోన్‌. పాట‌లూ సూప‌ర్ హిట్టే. ఇందులో `ఇల‌లో..` అనే పాటొక‌టి వుంది. ప‌ల్ల‌వి వ‌ర‌కూ.. కొత్త ట్యూనే. కానీ చ‌ర‌ణం వ‌ర‌కూ వ‌చ్చేసరికి `ప్రేమ ఎంత మ‌ధురం` పాట గుర్తొస్తుంది. ఈ చ‌ర‌ణాన్ని అచ్చు గుద్దిన‌ట్టు ‘అన్వేష‌ణ‌`లో వాడేశారు. ఈ రెండు సినిమాలకూ ఇళ‌య‌రాజానే సంగీత ద‌ర్శ‌కుడు. తాను వాడిన ట్యూన్ అదే భాష‌లో.. మ‌రో పాట‌కు వాడ‌డం ఇళ‌య‌రాజా చ‌రిత్ర‌లోనే లేదు. మ‌రి… ఈ ‘కాపీ’ ఎలా జ‌రిగింది? ఎందుకు జ‌రిగింది? అస‌లు విష‌యం ఏమిటంటే..

‘ప్రేమ ఎంత మ‌ధురం’ ట్యూన్ లోనే ఓ క‌న్న‌డ సినిమా కోసం పాట కంపోజ్ చేశారు ఇళ‌య‌రాజా. అప్ప‌ట్లో వంశీతో ఇళ‌య‌రాజాకు మంచి చ‌నువు, అభిమానం ఉండేవి. ఇళ‌య‌రాజా ఏ పాట చేసినా… ముందు వంశీనే వినేవారు. అలా.. క‌న్న‌డ చిత్రానికి సంబంధించిన ట్యూన్ వంశీ విన్నారు. ‘ఇది బాగుంది… మ‌న సినిమాలో వాడుకొందాం’ అని వంశీ చెప్ప‌డం, దానికి ఇళ‌య‌రాజా ఒప్పుకోవ‌డం జ‌రిగిపోయాయి. అయితే… అదే ట్యూన్‌లో ‘అభినంద‌న‌’కు ఓ పాట కంపోజ్ చేసిన విష‌యం ఇళ‌య‌రాజాకు గుర్తు లేదు. ఆ సంగ‌తి వంశీకీ తెలీదు. అలా… ‘ఇల‌లో’ పాట పుట్టింది. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే `ప్రేమ ఎంత మ‌ధురం` ప‌ల్ల‌వి ‘ఇల‌లో’ పల్ల‌వి రెండూ వేర్వేరు ట్యూన్లు. చ‌ర‌ణాలు మాత్రం ఒక‌టే ట్యూన్‌లో సాగుతాయి. ‘అభినంద‌న‌’ 1987లో విడుద‌ల అయితే ‘అన్వేష‌ణ‌’ 1985లో వ‌చ్చింది. నిజానికి ఈ రెండు సినిమాల‌కూ సంబంధించిన సంగీత ప‌నులు దాదాపు ఒకేసారి జ‌రిగాయి. కానీ ‘అభినంద‌న‌’ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యంగా విడుద‌లైంది. దాంతో… ‘అన్వేష‌ణ‌’ ట్యూన్ ని ‘అభినంద‌న‌’ కోసం ఇళ‌య‌రాజానే మ‌ళ్లీ కాపీ కొట్టార‌ని అనుకొంటారంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close