మహర్షి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తరవాత కూడా.. వంశీ పైడిపల్లి ఖాళీగా ఉండిపోయాడు. మహేష్‌తో సినిమా చేయాల్సివున్నా – కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మహేష్ కోసం ఎదురు చూడలేడు. ఎందుకంటే… `సర్కారు వారి పాట` తరవాత… మహేష్ రాజమౌళి కి డేట్లు ఇచ్చేశాడు. అందుకే.. మరో హీరో ని వెదికి పట్టుకునే పనిలో ఉన్నాడు వంశీ పైడిపల్లి. కాకపోతే…. స్టార్ హీరోలంతా బిజీనే. ప్రతీ హీరో చేతిలో రెండు మూడు సినిమాలైనా ఉన్నాయి. కాకపోతే… ముందే ఇప్పుడు ఓకే అంటే.. ఇంకెప్పుడైనా చేయొచ్చు కదా.. అన్నది వంశీ పైడిపల్లి ఆలోచన.
ఇటీవల పవన్ కల్యాణ్ ని కలిశాడు వంశీ. ఇద్దరి మధ్యా కథకు సంబంధించిన చర్చలు జరక్కపోయినా – సినిమా చేయాలన్న ఆలోచనని వంశీ పైడిపల్లి పవన్ ముందు పెట్టాడని టాక్. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా టచ్ లో ఉన్నాడట. బన్నీని వంశీ పైడిపల్లి తరచూ కలుస్తున్నాడని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.కాకపోతే.. ఇప్పుడు బన్నీ కూడా బిజీనే. `పుష్ష` అవ్వగానే… కొరటాల శివతో సినిమా చేయాల్సివుంది. పుష్షకీ, కొరటాల సినిమాకీ మధ్య గ్యాప్ వస్తే… అప్పుడు తాను రెడీ అయిపోవాలని వంశీ భావిస్తున్నాడు. ఇప్పటికైతే, ఈ ప్రాజెక్టు పైప్ లైన్ లో ఉందనుకోవొచ్చు.