సినిమాలు తీయడంలో వంశీది డిఫరెంట్ స్టయిల్. ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లు. అయితే గత కొన్నేళ్ళుగా ఆయన ‘మ్యాజిక్’ పండటం లేదు. దీంతో సినిమాలు తగ్గిపోయాయి. అయితే గత కొంతకాలంగా సైలెంటైపోయిన వంశి.. ఇప్పుడు మళ్లీ లైన్ లోకి వచ్చారు. లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్’ తీశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత కూడా వెంటనే కొత్త సినిమా మొదలుపెట్టడానికి ఆయన దగ్గర కొన్ని కధలు రెడీగా వున్నాయి. ఇందులో ఒక ప్రయోగాత్మకమైన సబ్జెక్ట్ కూడా వుందట. అదే మాటలు లేని సినిమా. అవును .. ఈ విషయాన్ని స్వయంగా వంశీని వెల్లడించారు.
”ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ రెడీ చేశా. ఇందులో రెండే పాత్రలు. హీరో ,హీరోయిన్. సినిమా మొత్తం మ్యూజికల్ గా ఉటుంది. హీరో, హీరోయిన్స్ మధ్య ఒక్క డైలాగ్ కూడా వుండదు. చివర్లో హీరోయిన్ తండ్రితో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హీరో అంటాడు. అదే డైలాగు. అంతకుమించి ఈ సినిమాలో ఒక్క మాట కూడా వుండదు. టోటల్ కధ రెడీ చేశా. సినిమా కోసం ఓకే పెద్ద సెట్ వేయాలి. సరైన టీం కోసం వెయిటింగ్” అని చెప్పుకొచ్చారు వంశీ.
వంశీ.. చెప్పిన మాటలు వింటుంటే సింగీతం పుష్పక విమానం గుర్తుకువస్తుంది. మరి.. వంశీ చెప్పే ఈ మాటలు లేని సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.