`ఆర్.ఆర్.ఆర్` తరవాత రాజమౌళి సినిమా ఏమిటన్నది తేలిపోయింది. మహేష్ బాబుతో ఓ సినిమా ఖాయమైంది. 2021 ప్రారంభంలో `ఆర్.ఆర్.ఆర్` విడుదల కానుంది. ఈలోగా… పరశురామ్ సినిమాని పూర్తి చేస్తాడు మహేష్ బాబు. మరి మధ్యలో వంశీపైడిపల్లి ప్రాజెక్టు ఒకటుంది.
నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ తరవాత వంశీ సినిమానే మొదలవ్వాలి. కథ విషయంలో మహేష్‌కి కొన్ని అనుమానాలు ఉండడంతో.. ఆ ప్రాజెక్టు పక్కకెళ్లింది. ‘పరశురామ్ తరవాత మీదే…’ అంటూ వంశీకి మహేష్ మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వంశీ పైడిపల్లి కూడా మహేష్ కథపై కసరత్తులు మరింత ముమ్మరం చేశాడు.
ఎప్పుడైతే రాజమౌళి సినిమా ఖాయమైందో, అప్పుడే వంశీ పైడిపల్లి ప్రాజెక్టుపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. పరశురామ్ సినిమాకీ, రాజమౌళి సినిమాకీ పెద్దగా గ్యాప్ లేదు. దాంతో వంశీ పైడిపల్లి సినిమా పక్కకెళ్లే ప్రమాదం ఎదుర్కొంటోంది. ఇప్పుడు మహేష్ బాబు దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. పరశురామ్ ప్రాజెక్టుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఆ వెంటనే వంశీ పైడిపల్లి సినిమా మొదలెట్టాలి. రాజమౌళి తో సినిమా 2021 వేసవిలో ప్రారంభం అవుతుందనుకుంటే… ఈలోగా రెండు సినిమాల్ని పూర్తి చేయగలగాలి. అయితే సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుని, ఆ విరామంలో కుటుంబంతో గడిపేందుకు ప్లాన్ చేసే మహేష్… కుటుంబం కోసం ఇచ్చే సమయాన్ని వంశీ పైడిపల్లి కోసం వదులుకుంటాడా అనేది ప్రశ్నార్థకం. లాక్ డౌన్ సమయంలో మహేష్ కూడా కొత్త సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. అసలు.. పరశురామ్నే మహేష్ తొందర పెట్టడం లేదని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేయాలి, పరశురామ్ సినిమా మొదలవ్వాలి, అది పూర్తవ్వాలీ.. ఆ తరవాతే కదా వంశీ సినిమా గురించి ఆలోచించాలి. సో.. ఇదంతా వంశీ పైడిపల్లిలో అయోమయానికి గురి చేస్తోంది.మహేష్‌ని నమ్ముకుని ఉండిపోవాలా? లేదంటే మరో హీరోని ట్రాక్ లో దించాలా? అనే విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు వంశీ.