మనకున్న సృజనాత్మక దర్శకుల్లో వంశీ ఒకరు. ఆయన సినిమా అంటే… గోదావరి అందాల్ని ఎంచక్కా కళ్లారా చూసేయొచ్చు. స్వచ్ఛమైన వినోదం, ఆహ్లాదకరమైన సంగీతం వంశీ చిత్రానికి ఆభరణాలు. పాతికేళ్ల ప్రస్థానంలో వంశీ నుంచి వచ్చినవి పాతిక సినిమాలే. అయినా.. సరే దేని మార్కు దానిదే. గత కొన్నేళ్లుగా వంశీ నుంచిసరైన సినిమా రాలేదు. సరదాగా కాసేపు తరవాత వంశీ హిట్టు అందుకోలేదు. ఇప్పుడు లేడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా ఫ్యాషన్ డిజైనర్ సినిమాని రూపొందిస్తున్నారాయన. చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. మేలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఫ్యాషన్ డిజైనర్‌పై ఆశలు పెంచుకోవచ్చు అనిపిస్తోంది. మణిశర్మ స్వరపరిచిన పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని వినికిడి. వంశీ స్టైల్ ఉంటూనే.. అందులో మణి మర్క్ కనిపించబోతోందట. దానికి తోడు గోదావరి అందాల్ని మరోసారి వంశీ తన కెమెరాలో అందంగా బంధించాడని తెలుస్తోంది. ఎమ్మెస్రాజు కూడా ఈసినిమాపై ప్రత్యేక దృష్టి నిలపడం, నిర్మాత మధుర శ్రీధర్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. కొత్త రచయితలతో వంశీ రాయించిన సంభాషణలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవబోతున్నాయట. ఆడియో ఫంక్షన్లేమీ లేకుండా ఒక్కో పాటనీ ఒక్కోరోజు విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని మాత్రం గ్రాండ్‌గా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మొత్తానికి వంశీ సినిమాకి శుభ సూచికలు బాగానే వీస్తున్నాయి. వంశీలాంటోడికి హిట్ట పడితే.. మంచిదేగా.