ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ట్రైన్ గురించి .. ట్రైన్ ఇంటీరియల్ గురించి… వేగం గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ప్రతీ స్టేషన్ లోనూ అదేదో బుల్లెట్ రైలన్నట్లుగా బీజేపీ నేతలు.. ప్రజాప్రతినిధులు స్వాగతం చెప్పారు. నిజానికి వందే భారత్ ట్రైన్.. వేగం ప్రకటించినంతగా ఉండటం లేదు. ఇప్పటికే ఉన్న అనేక సూపర్ ఫాస్ట్ ట్రైన్ రైళ్లకు తగ్గట్లుగానే ఉన్నాయి. దానికే ప్రధానమంత్రి ఈ రైళ్లను ప్రారంభిండడం.. హడావుడి చేయడం కామెడీగా మారిపోయిది.
నిజానికి మోదీ ఈ రైలు ప్రారంభోత్సవానికి మాత్రమే రాలేదు. ఇది ఒక ప్రోగ్రాం మాత్రమే. కానీ పదకొండు వేల కోట్ల విలువైన పనుల శంకుస్థాపనకు కూడా వచ్చారు. వీటిని హైలెట్ చేసుకోవడంలో బీజేపీ విపలమయింది. కేవలం వందే భారత్ గురించే ప్రచారం చేసుకోవడంతో ట్రోలింగ్ కు గురువుతున్నారు. ఓ సారి ప్రారంభించిన రైతులు పదే పదే ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బీజేపీ నేతలు కూడా దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.
ప్రధాని స్థాయి నేత రైళ్లు ప్రారంభించడమే కాస్త విచిత్రంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ అలాంటివేమీ పట్టించుకోరు. కానీ ప్రజల్లో మాత్రం చులకన అయ్యే పరిస్థితి ఉంది. వందే భారత్ పై అతిగా ప్రచారం చేసుకునే వ్యూహాలను బీజేపీ పాటిస్తే.. ముందు ముందు మరిన్ని ట్రోలింగ్‌కు గురయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీన్ని బీజేపీ నేతలు పట్టించుకుంటారో లేదో మరి !