టీడీపీ నేత వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన స్థానం ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. వంగవీటి రాధా నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. కానీ అక్కడ టీడీపీ తరపున బొండా ఉమ ఉన్నారు. విజయవాడ తూర్పులో పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. అలాగే పశ్చిమ నియోజకవర్గం జనసేనకే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సమీకరణాలు కుదిరితే. తూర్పు నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను గన్నవరంకు పంపి అ్కడ పోటీ చేయించే అవకాశం ఉంది.
అయితే టీడీపీ నాయకత్వం ఆయన ప్రభావం గరిష్టంగా ఉండాలంటే పార్లమెంట్ కు పోటీ చేయించలన్న ఆలోనచ చేస్తోదని చెబుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నంచి పోటీకి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనుచరులతో వంగవీటి రాధా చర్చిస్తున్నారు. వంగవీటి రాదా పొటెన్షియల్ లీడర్ అని ఆయన తో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటోంది. కానీ టీడీపీ సమీకరణాల ప్రకారం మచిలీపట్నం ఎంపీ స్థానం ఆఫర్ చేసే అవకాశం ఉంది . కానీ వమగవీటి రాధా అంగీకరిస్తారా లేదా అన్నది పాయింట్.
మరో వైపు జనసేన పార్టీకి విశాఖ సిటీలో ఒక స్థానం కేటాయించడం ఖాయం. ఒక వేళ విజయవాడ సిటీలోనే పోటీ చేయాలనుకుంటే.. జనసేన పార్టీలో చేరి తనకు కావాల్సిన సీటును డిమాండ్ చేసి మరీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆయన ఆలోచిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తానికి .. టీడీపీ హైకమాండ్‌తో చర్చించి త్వరలోనే తను పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.