హైదరాబాద్ ప్రపంచ ప్రముఖ కంపెనీలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. తాజాగా వ్యాన్ గార్డ్ సంస్థ కూడా తమ కేపబులిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకూ వ్యాన్‌గార్డ్ సంస్థకు మన దేశంలో ఆఫీసు లేదు. తొలి సారిగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ జీసీసీ సెంటర్ వల్ల రెండున్నర వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ ప్రభుత్వ సానుకూల పాలసీల వల్ల హైదరాబాద్‌ను ఎంచుకున్నామని వ్యాన్ గార్డ్ సీఈవో తెలిపారు.
వ్యాన్‌గార్డ్ పెట్టుబడి నిర్వహణ సంస్థ. 1975లో జాన్ బోగల్ ఈ సంస్థను ప్రారభించారు. వ్యాన్‌గార్డ్ ఇండెక్స్ ఫండ్స్‌ను సృష్టించడంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ ఇండెక్స్ ఫండ్ ఓ గేమ్ ఛేంజర్ గా మారింది ఈ కంపెనీ వల్లనే. వ్యాన్‌గార్డ్ వి దీర్ఘకాలిక, తక్కువ ఖర్చు పెట్టుబడి విధానంపై ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికే మెక్ డొనాల్డ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు లబించనున్నాయి.
ప్రపంచవ్యాప్త ఫార్మా దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న HCA హెల్త్‌కేర్ కంపెనీ హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను విస్తరించడానికి ప్రణాళికలు చేస్తోంది. మరో అమెరికా దిగ్గజ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు చేసింది. ఇటీవలే సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్ జీవశాస్త్రాల రంగంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ఒక ముఖ్య కేంద్రంగా మారుతోంది. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే .. గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలకు హైదరాబాద్ వేదికగా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.