టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల డిమాండ్ బాగా పెరిగింది. అందునా ఒకప్పటి అందాల కథానాయికలు అత్తలుగా, అమ్మలుగా వెండి తెరపై సందడి చేయడం మొదలెట్టారు. నదియా, మధుబాల, రాశీ… ఇలా పాత తరం కథానాయికల్ని తెలుగు తెరపై మళ్లీ చూసే అవకాశం దక్కుతోంది. ఇప్పుడు ఈ జాబితాలో వాణీ విశ్వనాథ్ కూడా చేరిపోయింది. బెల్లం కొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. ఈచిత్రంలో వానీ విశ్వనాథ్ కు ఓ కీలక పాత్ర దక్కింది.
అల్లుడు శ్రీనుకి అత్తగా, రకుల్‌కు అమ్మగా వాణీ విశ్వనాథ్ పాత్ర ఉండబోతోందని సమాచారం. ఆమె పాత్రని చాలా విభిన్నంగా తీర్చిదిద్దారని…. త్వరలోనే వాణీ విశ్వనాథ్ సెట్లో అడుగు పెట్టబోతోందని సమాచారం. ఘరానా మొగుడు, కొదమసింహాం లాంటి సినిమాలతో తెలుగునాట పాపులర్ అయ్యింది వాణీ విశ్వనాథ్. లేడీ ఓరియెంట్ సినిమాలూ చేసింది. మలయాళం, తెలుగు, తమిళం కలుపుకొని దాదాపుగా వంద సినిమాల్లో నటించింది. అన్నట్టు.. వాణీ విశ్వనాథ్‌కి కళ్లు చెదిరే పారితోషికం ఆఫర్ చేశాడట బోయపాటి. మరి ఆ పాత్ర ఏ రేంజులో ఎలివేట్ అవ్వబోతోందో చూడాలి.