పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. క్రాక్, వీరసింహారెడ్డి, యశోద, కోటబొమ్మలి పీఎస్.. చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో అలరించింది. ఇప్పుడు ఆమె నుంచి హను-మాన్ సినిమా వస్తోంది. ఇందులో అంజమ్మ అనే పాత్ర చేసింది వరలక్ష్మీ. ఈ పాత్ర తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని, ఈమధ్య అన్నీ విలనీ టచ్ వున్న పాత్రలు చేస్తున్న తనకు ఇదొక కొత్త తరహ పాత్ర అవుతుందని చెప్పుకొచ్చింది.
అలాగే.. సలార్ సినిమాలో శ్రియా రెడ్డి చేసిన పాత్రకు మొదట వరలక్ష్మీని సంప్రదించారని గతంలో వార్తలు వచ్చాయి. దీని గురించి వరలక్ష్మీ వద్ద ప్రస్తావిస్తే.. ‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి పెద్ద ఫ్యాన్ ని. కలసి నటించే అవకాశం వస్తే వదులుకోను. సలార్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అదంతా రూమర్. వస్తే ఆ ఛాన్స్ ఎందుకు వదులుకుంటా?’ అని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.