అతడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, ఈనాడు ప్రవచనం ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది. సర్కార్ సినిమా విషయంలో అన్నా డీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ, ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి చేష్టలు మానండి అంటూ ఘాటుగా స్పందించింది.
వివరాల్లోకి వెళితే, విజయ నటించిన సర్కార్ సినిమా తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి పాత్ర నాటి ముఖ్యమంత్రి జయలలితను తలపించేలా ఉంది. ఈ పాత్ర కేంద్రంగా సినిమా పై వివాదాలు ముసురుకున్నాయి. అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ సినిమాపై చెలరేగిపోయారు. నటుడు విజయ్ ఫ్లెక్సీలను చించడం, సినిమా పోస్టర్లను తగలబెట్టడం మొదలుకొని, సినిమాలోని సీన్లను కట్ చేసేలా నిర్మాతపై ఒత్తిడి తీసుకురావడం దాకా రకరకాలుగా ఈ సినిమా యూనిట్ ని వేధిస్తున్నారు అన్నాడీఎంకే నాయకులు. దీనిపై నటి వరలక్ష్మి తనదైన శైలిలో స్పందించింది.
ట్విట్టర్ వేదికగా స్పందించిన వరలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం మరీ ఇంత బలహీనంగా ఉందా, ఒక సినిమాలోని ఒక సీన్ చూసి భయపడేంత బలహీనంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా, ఏదైతే చేయకూడదు ఈ ప్రభుత్వం అదే చేస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి చేష్టలు ఆపివేయడం మంచిది. క్రియేటివిటీని హరించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకపోవడమే మంచిది అంటూ వ్యాఖ్యలు చేసింది నటి వరలక్ష్మి. అయితే వరలక్ష్మి నేతలపై అన్నది నాయకులు ఇంకా స్పందించాల్సి ఉంది.
https://twitter.com/varusarath/status/1060806844128493568/photo/1