ఆంధ్రప్రదేశ్ పోలీసులు దూకుడు మీద ఉన్నారు. వివేకా హత్య కేసును చేధించేందుకు సమాచారం లభిస్తుందని భావిస్తున్న ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాలో టీడీపీ నేత వర్ల రామయ్య కూడా చేరారు. వర్ల రామయ్యకు.. వైఎస్ వివేకా హత్య ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరై… కేసుకు సంబంధించి.. ఆయన వద్ద ఉన్న సమాచారం అంతా.. ఇవ్వాలని ఆదేశించింది. అసలు వర్ల రామయ్యకు.. వైఎస్ వివేకాకు ఎమిటి సంబంధం అనే సందేహం అందరికీ రావొచ్చు కానీ.. పోలీసులకు మాత్రం రాదు. ఎందుకంటే… వర్ల రామయ్య.. రోజూ… వైఎస్ వివేకా హత్య కేసుపై… టీడీపీ తరపున మీడియాతో మాట్లాడుతున్నారు. పోలీసుల తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. అందుకే.. వర్ల రామయ్యను ప్రశ్నించాలని.. పోలీసులు నిర్ణయించారు.
కడప ఎస్పీగా… నాలుగు నెలల్లో మూడో ఐపీఎస్ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అన్బురాజన్ ఎస్పీగా ఉన్నారు. వచ్చీ రాగానే ఆయన కేసులపై అనుమానాలు కలిగేలా ప్రకటనలు చేశారు. దీంతో… వర్ల రామయ్య మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడే కాదు.. ఆయన వైఎస్ వివేకా హత్య జరిగినప్పటి నుండి.. టీడీపీ తరపున ఆయనే మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీరుపై.. పోలీసులు వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పోలీసులపై విమర్శలు చేస్తూండటంతో.. పోలీసు అధికారుల సంఘం నేత కూడా.. మీసం తిప్పి.. తొడకొట్టి… వర్ల రామయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాతి రోజే.. సిట్ నుంచి వర్ల రామయ్యకు నోటీసులు వచ్చాయి.
పూర్వాశ్రమంలో పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య… వైఎస్ వివేకా హత్య ఎవరి పనో.. పులివెందులలో ప్రతి ఒక్కరికి తెలుసని వాదిస్తున్నారు. వైఎస్ జగన్ కు.. వైఎస్ భాస్కర్ రెడ్డి.. వైఎస్ వివేకా కుమార్తె సునీతకు అందరికీ తెలుసని వర్ల రామయ్య చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఇలా తెలుసని చెప్పడానికి వర్ల రామయ్య వద్ద ఉన్న ఆధారాలేమిటో చెప్పాలని… పోలీసులు అడుగుతున్నారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. గతంలో.. జగన్, విజయసాయి లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలు ఉదహరిస్తూ.. మరి వారిని ఎందుకు ప్రశ్నించరని అడుగుతున్నారు.