తెలుగులో విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. దీంతో ఇతర పరిశ్రమలకు చెందినవాళ్లు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడి దక్కించుకున్నారు. ముఖ్యంగా హిందీలో సందీప్ రెడ్డి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా `కబీర్‌సింగ్` పేరుతో తెరకెక్కుతోంది. కాగా.. తమిళంలో హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో వర్మ అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది. అయితే తమిళ వెర్షన్ వర్మను విడుదల చేయబోవడం లేదని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అసలు కారణమేమంటే.. తమిళ వెర్షన్‌ను ఈ4 ఎంటర్టైన్మెంట్ నిర్మించడానికి సిద్ధమైంది. ఈ సంస్థ బి స్టూడియోతో కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈ స్టూడియో సినిమా ఫస్ట్‌కాపీని అందించాలి. అయితే సినిమా అంతా సిద్ధమైంది. ఫస్ట్ కాపీ చూసిన ఈ 4 ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులకు సంతృప్తిగా అనిపించలేదల. దీంతో వీళ్లు తమిళ వెర్షన్‌ను రీషూట్ చేయాలనుకుంటున్నారట. మరో వెర్షన్‌ను సిద్ధం చేసి జూన్‌లో విడుదల చేయాలనేది నిర్మాణ సంస్థ ఆలోచనగా కనపడుతుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు హీరో ధ్రువ్ మినహా డైరెక్టర్ సహా అందరినీ కొత్త వారిని తీసుకోవాలనుకుంటున్నారు.