వైఎస్ విజయలక్ష్మిపై అత్యంత ఘోరంగా పోస్టులు పెట్టే ధైర్యం.. జగన్ ఇంట్లో జీతగాడికి ఉంటుందా ? వైఎస్ సునీతతో పాటు వైఎస్ షర్మిల ఎవరికి పుట్టారో చర్చించేంత సాహసం.. వైఎస్ కుటుంబ దయాదాక్షిణ్యాలపై మీద ఆధారపడే వ్యక్తి కుటుంబానికి ఉంటుందా ?. తమకు ఎంత కోపం ఉన్నా సరే ప్రైవేటు సంభాషణల్లో కూడా ఇలాంటి విషయాలు చర్చించరు. కానీ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అలవోకగా ఇలాంటి వాటిని ఇష్టం వచ్చినట్లుగా తన సోషల్ మీడియాకు ఎక్కించారు. ఎలా సాధ్యం?. సింపుల్.. ఆయనకు వైఎస్ కుటుంబం నుంచే భరోసా రావడం. నర్రా వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడని పోలీసులు ప్రకటించడంతో ఇప్పుడు ఆ విషయంలో అధికారిక స్పష్టత వచ్చింది.
వర్రా రవీందర్ రెడ్డి స్వతహాగా వైఎస్ కుటుంబంపై కామెంట్ చేసేంత ధైర్యం ఉన్నవాడు కాదు. వైెస్ కుటుంబాన్ని ఒక్క మాట అంటే పులివెందులలో బతకలేదని ఆయన కుటుంబానికి ఇంకా బాగా తెలుసు. కానీ అవినాష్ రెడ్డి ఆర్డర్ చేస్తే మాత్రం ఆయనకు తప్పలేదు. వైఎస్ అవినాష్ రెడ్డి అనుంగు అనుచరునిగా వైఎస్ భారతీ రెడ్డి పులివెందుల అనధికారిక పీఏగా చెలామణి అవుతున్న ఆయన సోషల్ మీడియా భావజాలం మొత్తం అవినాష్ రెడ్డిదే. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఫోన్ ఉపయోగించుకుని అవినాష్ రెడ్డి ఇలాంటి బూతులు తిట్టాడని వర్రాకు పంపేవాడు. ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు.
అంటే.. వైఎస్ వినేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన మాస్టర్ మైండ్ మాత్రమే కాదు.. షర్మిల, సునీత, విజయలక్ష్మిలపై అడ్డగోలుగా సోషల్ మీడియాలో ఆరోపణలు చేయించిన విషయంలోనూ ఆయనే నెంబర్ వన్ నిందితుడు అని ప్రజలకు సులువుగా అర్థమవుతుంది. మరి అవినాష్ రెడ్డినే ఇదంతా చేశారా లేకపోతే ఇంకెవరైనా ఇలా వారిపై ఏకపక్షంగా దాడి చేయాలని సూచించారా..?. మానసికంగా వేదన కల్పించాలని ఆదేశించారా అన్నది తేలాల్సి ఉంది. ఎదుకంటే సొంత తల్లి, చెల్లిపై పోలీసులు పెట్టినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. పోలీసులకు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. అందుకే చాలా మంది అనుమానించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.