‘స్వాతిముత్యం’ సినిమాలో కలిసి నటించారు బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ. ఈ సినిమా డీసెంట్ గానే నిలిచింది. అయితే సినిమా విడుదలైన కొన్నాళ్ళకి గణేష్, వర్ష పెళ్లి చేసుకుంటారని, ఇరు కుటుంబాలు మాట్లడుకున్నాని ఓ గాసిప్ తెగ తిరిగింది. తాజాగా ఈ గాసిప్ పై స్పందించింది వర్ష.”ఇదేం గాసిప్ అండీ.. ఇలా ఎలా పుట్టించేస్తారు’ అని ఆశ్చర్యపోయింది.
‘ఓ ఇద్దరు.. ఫలానా చోట కలిశారని, కాఫీ తాగారని తెలిస్తే.. ఇలాంటి గాసిప్పులు పుట్టించడంలో ఓ అర్ధం వుంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ గణేష్ ని కలిసిందే లేదు. అయినా కూడా అలా ఎలా గాసిప్పు పుట్టించేశారో అర్ధం కాలేదు’ అని చెప్పుకొచ్చింది వర్ష. ఆమె నటించిన ఊరు పేరు భైరవ కోన ఈనెల 16 విడుదల కానుంది. ఇందులో గిరిజన అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, కథలో చాలా బలమైన పాత్ర చేస్తున్నాని, సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చింది వర్ష.