క్రాక్ కాంబినేషన్ ని బాలకృష్ణ సినిమాలో మళ్లీ సెట్ చేయాలని చూస్తున్నాడు గోపీచంద్ మలినేని. `క్రాక్`లో కథానాయికగా నటించిన శ్రుతిహాసన్ ని బాలయ్యకు జోడీగా చేసేశాడు. ఇప్పుడు క్రాక్ లో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ని కూడా రంగంలోకి దింపాడు. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా.. శ్రుతి ఎంపికైంది. ఇప్పుడు ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. క్రాక్ తరవాత… వరలక్ష్మికి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. `నాంది`లో తను ఓ కీలక పాత్ర పోషించింది. బాలయ్య సినిమాలోనూ తన పాత్ర నెగిటీవ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్‌ని ప్రతినాయకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి తరవాత.. సెట్స్‌పైకి వెళ్లనుంది.