వరుణ్ సందేశ్.. హ్యాపీడేస్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడీ హీరో. కొత్తబంగారులోకంతో యూత్‌కి బాగా దగ్గరైపోయాడు. వెంటనే చిన్న నిర్మాతలు వరుణ్ చుట్టూ మూగేశారు. పెద్ద నిర్మాతలు కూడా అడ్వాన్సులు ఇచ్చారు. ఏడాదికి 5 సినిమాలతో బిజీ బిజీగా గడిపేశాడు. అయితే అందులో ఒక్కటి హిట్టయితే ఒట్టు. దాంతో వరుణ్ కెరీర్ తిరోగమన దశలో వెళ్లింది. ఇప్పుడు వరుణ్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. యువ హీరోల దూకుడికి వరుణ్ కూడా సైడ్ అయిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడో సినిమా పట్టాడు. ఆ సినిమానే మిస్టర్ 420
ప్రియాంక భరద్వాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రవికుమార్ దర్శకుడు. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరుణ్ సందేశ్‌కి హిట్లు లేకపోవడం వల్ల.. ఈసినిమా కాస్త ముందుకూ, కాస్త వెనక్కీ కదలుతూ వచ్చింది. ఈ సినిమాని పూర్తి చేసి వదిలే ధైర్యం ఇప్పటికి చేస్తున్నారు నిర్మాతలు. వరుణ్‌సందేశ్ ఎప్పుడూ చేయలేని కథ అని. ఈ సినిమాతో వరుణ్ హిట్టు కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. చూద్దాం ఈ 420 వేషాలైనా వరుణ్‌కి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయేమో?!