`అంతరిక్షం`లాంటి కథలు, సినిమాలు చాలా అరుదుగా వస్తాయంటున్నాడు వరుణ్‌తేజ్. తను కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌లో `అంతరిక్షం` ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ…
”ప్రతీసారీ ఏదో ఓ వెరైటీ సినిమా చేద్దామని అనుకుంటుంటా. సంకల్ప్ అలాంటి కథే చెప్పాడు. తొలి సినిమా తోనే జాతీయ అవార్డు రావడం మామూలేవిషంయ కాదు. రెండోసారి కూడా అద్భుతమైన పాయింట్ తో తీశాడు. తరువాతైనా నేల మీద ఉండి సినిమా తీయాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలకు టీమ్ వర్క్ చాలా అవసరం. సినిమా ఒకడి వల్ల కాదు. ఒకడి సొత్తు కాదు. టీమ్ ఎఫెక్ట్ ఉండాలి. అలాంటి టీమ్ ఈ సినిమాకి దొరికింది. హీరోగా నేను ఓ ఫైటు చేస్తే జనాలు గాల్లో ఎగురుతారు. కానీ ఈసినిమాలో నేను గాల్లో వేలాడుతూ ఉంటా. ఫస్ట్ షాట్ నుంచే దర్శకుడు ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లిపోతాడు. పాటల కోసం, కామెడీ కోసం అని ఎక్కడా దారి మరలలేదు. తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాల్ని ఆదరిస్తున్నారు.కొత్త సినిమా కావాలంటున్నారు. ఈ సినిమా కూడా అలానే ఆదరిస్తారని అనుకుంటున్నా. ఈ సినిమా చేసేటప్పుడు ఎక్కడో ఓ డౌట్ ఉండేది. చరణ్ అన్న దగ్గరకు ఇలాంటి సినిమా చేయగలనా? అని అడిగాను. తప్పకుండా చేయ్యాల్సిందే అని ప్రోత్సహించాడు ఈ సినిమా చూశాక.. ‘నేనొక భారతీయుడ్ని, నేనొక తెలుగువాడ్ని, మెగా అభిమానిగా మీరంతా గర్వపడతారు” అని ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.