సినిమాల్లో క్రియేటివిటీ సంగతేమో గానీ, ఆ సినిమా ప్రకటించడంలోనూ, ప్రమోషన్లు చేయడంలోనూ దర్శక నిర్మాతలు బోల్డంత సృజనాత్మకత రంగరిస్తున్నారు. వరుణ్ తేజ్ కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా ఓ ఆసక్తికరమైన వీడియోతో బయటకు వదిలారు నిర్మాతలు. వరుణ్ ఇప్పుడు ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. దర్శకుడు, ఇతర వివరాల్ని ఈనెల 19న తెలియజేస్తారు. ఈలోగా ఓ ఇంట్రస్టింగ్ ప్రోమోని వదిలారు. వరుణ్.. దీక్షగా ఓ స్క్రిప్టు చదువుతున్నట్టు.. చివరి పేజీ పూర్తి చేసి.. ఉత్సాహంగా స్క్రిప్టుని మూసినట్టు ఆ వీడియోలో కనిపించింది. టేకాఫ్‌కి సిద్ధమవుతున్న ఓ ఫ్లైట్ బొమ్మని చూపించి `ఇక ఈసినిమా మొదలైపోతోంది` అంటూ హిట్ ఇచ్చారు. మొత్తానికి తొలి అడుగులోనే క్రియేటీవ్‌గా ఆలోచించి, ప్రాజెక్టుపై కాస్త పాజిటీవ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేశారు. సినిమాలోనూ ఇంతే క్రియేటివిటీ కనిపిస్తే వరుణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టే. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. ఇంతకు ముందెప్పుడూ వరుణ్ ఇలాంటి పాత్ర చేయలేదని, ఈ పాత్ర కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాత్రేమిటో? దాని కథేమిటో? అసలు ఈ సినిమా ఎలాంటి జోనరో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలంతే.