`గని`లో బాక్సర్ అవతారం ఎత్తాడు వరుణ్‌తేజ్. త్వరలోనే పైలెట్ గా కూడా మారబోతున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా సోనీ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమాని రూపొందించడానికి రెడీ అయ్యింది. ఇందులో వరుణ్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్ గా కనిపించబోతున్నాడట. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్. కథ దాదాపుగా రెడీ అయిపోయింది. వరుణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాతో వరుణ్ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ ఇదని సమాచారం. బాలీవుడ్ లో `ఉరి` వచ్చింది కదా.. ఈ సినిమా కూడా అదే జోనర్లో సాగబోతోంది. `గని` ఈ శుక్రవారం విడుదల అవుతోంది. వచ్చే నెలలో `ఎఫ్ 3` కూడా వచ్చేస్తోంది. ఇటీవలే ప్రవీణ్ సత్తారు సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తరవాతే.. సోనీ సినిమా మొదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.