మన హీరోలకు నెగిటీవ్ పాత్రలపై మోజు మళ్లింది. `జై లవకుశ`లో ఎన్టీఆర్ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపించాడు. రాజమౌళి సినిమాలోనూ ఎన్టీఆర్ ప్రతినాయకుడే అనే టాక్ వినిపిస్తోంది. రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు నెగిటీవ్ పాత్రలు చేశారు.. ఇంకా ఇంకా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వరుణ్‌తేజ్ కూడా నెగిటీవ్ పాత్రల వైపు దృష్టి సారించడానికి సమాచారం. అందుకు తగిన పాత్ర కూడా దొరికింది. తమిళంలో ఘన విజయంసాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘జిగర్తాండ’. ఇందులో సిద్దార్థ్ కథానాయకుడిగా నటించినా.. పేరు మొత్తం ప్రతినాయకుడిగా కనిపించిన బాబీ సింహాకు వెళ్లింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కథానాయకుడి పాత్రని ఇంకాస్త డౌన్ చేసి, ప్రతినాయకుడి పాత్రకు మరింత హైప్ ఇవ్వాలని చూస్తున్నార్ట. ఆ పాత్రలో వరుణ్‌తేజ్ కనిపించనున్నాడని సమాచారం. ‘జిగడ్తాండ’ రైట్స్ దిల్‌రాజు దగ్గరే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ టేకప్ చేయనున్నాడని సమాచారం. మరి సిద్దూ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో చూడాలి.