‘ఎఫ్ 2’ కోసం తొలిసారి కలసి నటించారు వెంకటేష్, వరుణ్‌తేజ్. ఇందులో వీరిద్దరూ కోబ్రాలట. అంటే కో – బ్రదర్స్ అన్నమాట. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకి హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. అయితే వాస్తవానికి వీరిద్దరూ కలసి నటించే అవకాశం ఇది వరకూ వచ్చింది. రెండుసార్లు వరుణ్‌తేజ్ ఆ అవకాశాన్ని వదులుకున్నాడు.
ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు సినిమాలో.. వెంకటేష్ కి ఓ అల్లరి కొడుకు ఉంటాడు కదా? ఆ పాత్ర కోసం వరుణ్‌తేజ్‌ని అడిగారట. కానీ.. అప్పట్లో కుదర్లేదు. మళ్లీ ‘వాసు’ సినిమా గుర్తుంది కదా? అందులో వెంకటేష్ సోదరుడిగా కనిపించే అవకాశం వచ్చింది. అప్పుడు వరుణ్ కాస్త బొద్దుగా ఉండేవాడట. అందుకే… ఆ పాత్రకు తను నప్పడని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇంత కాలానికి వెంకీతో మళ్లీ కలిసి నటించే అవకాశం వచ్చింది వరుణ్‌కి. ”అప్పట్లో రెండుసార్లు నటించే ఛాన్స్ వచ్చింది. కానీ వదులుకున్నా. ఇన్నాళ్లకి ఆయనతో కలసి నటించాను. ఈసారి వెంకటేష్ గారితో సినిమా అంటే నా పాత్ర ఏమిటి? కథ ఏమిటి? అని కూడా అడగను. వెంటనే ఒప్పుకుంటా. ఆయన మా అందరికీ డార్లింగ్” అంటున్నాడు వరుణ్.