వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. దీనికి `గని` అనే పేరు ఖరారు చేశారు. ఈరోజు.. వరుణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈసినిమా టైటిల్ ని ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వరుణ్ ని చూపించారు. ఈ యేడాది జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో తండ్రి పాత్రకు చాలా పాత్ర వుంది. ఆ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నాడు. అందాల రాక్షసి ఫేమ్… నవీన్ చంద్రకు కీలకమైన పాత్ర దక్కింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి కాస్టింగ్ భారీగానే వుంది. దానికి తగ్గట్టు.. టెక్నికల్ టీమ్ కూడా బాగా కుదిరింది. మరి బాక్సాఫీసు రింగులో `గని` ఏం చేస్తాడో చూడాలి.