గాండీవధారి అర్జున… వరుణ్ తేజ్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్. గని కూడా ఫ్లాప్ అయ్యింది కానీ, ఈ రేంజ్ లో నష్టాల్ని తీసుకురాలేదు. నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో ఎంతో కొంత వెనక్కి వచ్చింది కానీ, లేదంటే నిర్మాత నిండా మునిగేవాడే.
ఈ సినిమాతో వరుణ్ తేజ్ కూడా వెనకేసిందేం లేదు. ఈ సినిమాకి ముందు వరుణ్‌కి రూ.12 కోట్లు పారితోషికం ఇస్తామన్నారు. బడ్జెట్ ఎక్కువయ్యేసరికి రూ.8 కోట్లకు తగ్గింది. సినిమా క్వాలిటీ కోసం తన పారితోషికాన్ని త్యాగం చేశాడు వరుణ్. తీరా చివరికి వచ్చే సరికి కేవలం రూ.5 కోట్లతో సరిపెట్టారు. సినిమా ఫ్లాప్ అయ్యే సరికి వరుణ్ కూడా ఏం అడగలేకపోయాడు. విషయం ఏమిటంటే… ఈ సినిమాతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం అందుకొన్నాడు. ప్రవీణ్ తో పోలిస్తే.. వరుణ్‌కి కోటి రూపాయలు మాత్రం అదనంగా లభించిందన్నమాట. గని ఫ్లాప్ అయినా వరుణ్ కి రూ.10 కోట్ల వరకూ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. తన సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి మొత్తమే వస్తుంది. అలాంటి దశలో రూ.5 కోట్లకు సినిమా చేశాడంటే… వరుణ్ మరో రూ.5 కోట్లు నష్టపోయినట్టే లెక్క.