కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన మెగా వారసుడు వరుణ్ తేజ్.. లోఫర్ తో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి పర్వాలేదనిపించాడు. వరుణ్ తో సినిమా అంటే అసలు వరకు ఓకే కాని లాభాలు పొందాలంటే కష్టమే అనే పరిస్థితి వచ్చింది. అయితే తనతోనే సేఫ్ జోన్ లో సినిమా తీసే టెక్నిక్ ఎవరు ప్రయత్నించడంలేదు. మొన్నటిదాకా కంచె దర్శకుడు క్రిష్ తోనే రాయబారి అనే సినిమా మొదలవుతుందని హడావిడి చేసి చివరకు అది కాస్త టైం పడుతుంది అని అంటున్నారు.
ఆ సినిమా ఆగిపోడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతుంటే ఏది నమ్మాలో మెగా ఫ్యాన్స్ కు అర్ధం కావట్లేదు. సరే అది ఎలాగు అటకెక్కింది కదా అని మిగిలిన సినిమాలు చేస్తే పోలా అనుకుంటే ఇప్పుడు తాను కమిట్ అయిన మరో సినిమా నుండి కూడా తాను వైదొలగాడని సమాచారం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా కమిట్ అయ్యాడు అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా ఆఫర్ కూడా వరుణ్ తేజ్ మిస్ చేసుకున్నాడట.
ఆ సినిమా అవకాశం వరుణ్ తేజ్ నుండి మరో మెగా హీరోకి వెళ్లిందని ఫిల్మ్ నగర్ టాక్. మరి కెరియర్ మొదట్లోనే ఇలా కమిట్ అయిన సినిమాలు వేరే వారికి పోతే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి వస్తుంది. మరి దీన్ని వరుణ్ తేజ్ గమనించి చేసే సినిమాలనే కమిట్ అయితే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు సిని ప్రముఖులు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి ‘ఫీల్ మై లవ్’ సినిమా ఒక్కటే కచ్చితంగా చేస్తున్నాడన్నది వాస్తవం.