సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే… ఇలా వరుస హిట్లు కొట్టాడు నక్కిన త్రినాథరావు. తన చివరి సినిమా 2018లో వచ్చింది. అంటే… మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. నిజానికి గ్యాప్ తీసుకోలేదు. వచ్చింది. మూడేళ్లుగా ఓ కథ పట్టుకుని, హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. రెండేళ్లు.. రవితేజ దగ్గరే గడిచిపోయాయి. రవితేజ – నక్కిన ప్రాజెక్టు ఎప్పుడో ఫిక్సయ్యింది. కానీ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. వేచి వేచి అలసిపోయాడేమో… ఇప్పుడు మరో హీరో కాంపౌండ్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ తో నక్కిన ఓ సినిమా చేయబోతున్నాడట. కథ కూడా చెప్పేసినట్టు టాక్. ఇప్పటి వరకూ… యాక్షన్ సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెట్టిన వరుణ్, రొమాంటిక్ కామెడీ జోనర్ లో సినిమా చేయాలని భావిస్తున్నాడట. అందుకే నక్కిన పై దృష్టి పెట్టాడని టాక్. రవితేజ కంటే ముందు వరుణ్‌తో నక్కిన సినిమా చేస్తాడా? లేదంటే.. రవితేజతో సినిమా పూర్తిగా పక్కన పెట్టేసి, అదే కథతో లాగించేస్తున్నాడా అనేది తెలియాల్సివుంది. కాకపోతే.. వరుణ్ – నక్కినల ప్రాజెక్టు మాత్రం ఇప్పుడు పైప్లైన్కొచ్చింది. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.