వరుణ్ తేజ్ డిఫరెంట్ జోనర్స్ ప్రయత్నిస్తున్నారు. ఏరియల్ వార్ యాక్షన్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తర్వాత కరుణ కుమార్ దర్సకత్వం ‘మట్కా’ సినిమా చేస్తున్నారు. ఇదొక పిరియాడిక్ డ్రామా. గాంబ్లింగ్ గేమ్ నేపధ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న కథ.
మట్కా తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాకి కనకరాజుఅనే టైటిల్ ని అనుకుంటున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఫైనల్ కావచ్చు.
మేర్లపాక సినిమాలు క్రైమ్ కామెడీ టచ్ తో వుంటాయి. ఈ సినిమా మాత్రం కొత్త జోనర్ లో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. మట్కా పూర్తనవెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది.