ఎఫ్2 ఎవరూ ఊహించని విజయం అందుకుంది. ఈ విజయం చిత్ర యూనిట్ కి గ్రేట్ ఎనర్జీగా పని చేసింది. ఎఫ్ 2 ఫ్రాంచైజ్ లో సినిమాలు వస్తూనే ఉంటాయని నిర్మాత దిల్ రాజు స్వయంగా చెప్పారు. రేపే ఎఫ్ 3 వస్తుంది. సహజంగానే సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. యూనిట్ మొత్తం నవ్వులు గ్యారెంటీగా ఇస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ మరో కొత్త సంగతి చెప్పాడు.
ఎఫ్ 3లో మెగా ఫ్యామిలీ , దగ్గుబాటి ఫ్యామిలీ డైలాగులు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఐతే ఈ సిన్మాలో ఇంకో స్పెషల్ ఎపిసోడ్ వుంది. అందరి హీరోల ఫ్యాన్స్ ఆనందపడేలా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట అనిల్ రావిపూడి.” నేను చెప్పిన మెగా ఫ్యామిలీ డైలాగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారు” అని చెప్పుకొచ్చాడు వరుణ్. అలాగే ఈ సినిమా లో పిల్లల గురించి ఒక సెపరేట్ ఎపిసోడ్ వుందట. ట్రాక్ కూడా బావుంటుందని చెప్పుకొచ్చాడు వరుణ్.