శేఖర్ కమ్ములది సెపరేట్ స్టైల్. యూత్ పల్స్ భలే పట్టేశాడాయన. అందులోనూ అర్బన్ కాలేజీ స్టూడెంట్స్ మైండ్ సెట్‌ని బాగా అర్థం చేసుకొన్నాడు. వాళ్ల కథల్ని వెండి తెరపై తీసుకొస్తున్నాడు. తాజాగా మరోసారి ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇదో లవ్ స్టోరీ. అమెరికా అబ్బాయికీ, తెలంగాణ అమ్మాయికీ జరిగే ప్రేమకథ. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.
ప్రస్తుతం శ్రీనువైట్ల సినిమా మిస్టర్‌తో బిజీగా ఉన్నాడు వరుణ్‌తేజ్. వచ్చే నెలలో ఈ సినిమా మొదలవుతుంది. మిస్టర్‌తో పాటే.. శేఖర్ కమ్ముల సినిమా కూడా సమాంతరంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక కోసం అన్వేషిస్తోంది. కొత్తమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. శేఖర్ సినిమా లంటే మిక్కీ జెమేయర్ పేరు వినిపిస్తుంది. ఈ చిత్రానికీ తనే సంగీతం అందించే అవకాశాలున్నాయి.