మెగా హీరోలంతా ఒకటే టీమ్. అందులో డౌట్ లేదు. కానీ.. ఇప్పుడు ఈ టీమ్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేశాడని మెగా అభిమానులే చెబుతుంటారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల్లో చాలామంది అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తుంటారు. బన్నీ ఫ్యాన్స్ కూడా అంతే! అల్లు అర్జున్ వ్యవహార శైలి కూడా అందుకు ఊతం ఇస్తుంటుంది. మెగా ఫ్యాన్స్‌ని కాస్త తన వరకూ `అల్లు అర్జున్ ఆర్మీ`గా మార్చేసుకొన్నాడు. నంథ్యాల ఎలక్షన్ క్యాంపెయినింగ్ వేరే వ్యవహారం. కొత్తలో చిరంజీవి నామ జపం చేసిన బన్నీ, ఆ తరవాత ఆయన్ని మర్చిపోయాడన్నది మెగా ఫ్యాన్స్ చేసే ఆర్గ్యుమెంట్.
ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేయాల్సివస్తోందంటే…. `మట్కా` ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖపట్నంలో అట్టహాసంగా జరిగింది. అక్కడ వరుణ్ తేజ్ స్పీచ్ అల్లు అర్జున్ హేటర్స్ కు బాగా కిక్ ఇచ్చింది. ఎవరైనా సరే, ఎవరి వల్ల ఎదిగామో, వాళ్లని మర్చిపోకూడదు, అలా మర్చిపోతే, ఎన్ని గొప్ప విజయాలు సాధించినా వ్యర్థమే.. అంటూ వరుణ్ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) అన్నయ్య (రామ్ చరణ్)లను ప్రతీ వేదికపై గుర్తు చేసుకొంటూనే ఉంటానని, ఎవరు ఎన్ని అనుకొన్నా, ఇంట్లో వాళ్ల పేర్లు ఎక్కువగా చెబుతావేంటి? అని అడిగినా తాను పద్ధతి మార్చుకోనని, వాళ్ల వల్లే వృద్దిలోకి వచ్చానని గుర్తు చేసుకొన్నాడు.
నిజానికి వరుణ్ వివాదాల్లో తలదూర్చే మనిషి కాదు. తన గురించి కానీ, తన సినిమా గురించి కానీ ఎక్కువగా మాట్లాడుకోడు. కానీ.. ఈ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నంధ్యాల ప్రచారానికి బన్నీ వెళ్లినప్పుడు నాగబాబు తన కోపాన్ని, అసహనాన్నీ దాదాపుగా బహిరంగంగానే వ్యక్తపరిచాడు. `మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు. లేదంటే పరాయివాళ్లే` అంటూ పరోక్షంగా బన్నీకి ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇప్పటికీ.. ఆ దూరం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరుణ్ వ్యాఖ్యలతో పాత సంగతులే మళ్లీ అభిమానులు తలచుకొంటున్నారు.
Varun Tej speech #MATKA
Again some controversy ? pic.twitter.com/SRCXzau9ov
— Telugu360 (@Telugu360) November 10, 2024