సాహోతో లక్కీ ఛాన్స్ కొట్టాడు సుజిత్. ఆ సినిమాతో టాప్ లీగ్‌లో చేరే అవకాశం వచ్చింది. కానీ ఏమైంది? సాహో తరవాత.. సుజిత్‌ని పట్టించుకొనే నాధుడే లేకపోయాడు. మధ్యలో చాలా ప్రాజెక్టుల్లో సుజిత్ పేరు వినిపించింది. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. సుజిత్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ… దానికి సంబంధించిన ఇతరత్రా వివరాలేం బయటకు రాలేదు. చిరుతో సినిమా ఉందని, చరణ్‌తో చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకు మెగా హీరోతోనే సినిమా ఖాయం చేసుకొన్నాడు సుజిత్. అవును.. వరుణ్ తేజ్ – సుజిత్ కాంబో దాదాపు సెట్టయ్యిందన్నది టాలీవుడ్ టాక్.
వరుణ్‌తేజ్ కోసం సుజిత్ ఓ కథ రెడీ చేసుకున్నాడని, అది వరుణ్‌కి వినిపించాడని, వరుణ్ కి బాగా నచ్చిందని, దాంతో ఈ ప్రాజెక్టు ఓకే అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. అది అయ్యాక.. సుజిత్ సినిమా మొదలవుతుందా, లేదంటే రెండూ సమాంతరంగా తెరకెక్కుతాయా? అనే విషయాలు తెలియాల్సివుంది.