వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. అయితే ఈమధ్య కాలంలో సెలబ్రెటీల పెళ్లి వీడియోలు ఓటీటీ వేదికలపై ప్రసారం అవుతున్నాయి. నయనతార, హన్సిక పెళ్లి వీడియోలు కూడా ప్రముఖ ఓటీటీ వేదికల్లో వున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వీడియో కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందనే వార్త బయటికి వచ్చింది. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయిలకు వెచ్చించి నెట్ ఫ్లిక్స్ వీడియో రైట్స్ ని పొందిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని వరుణ్ తేజ్ టీం వెల్లడించింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వేడుక ఓటీటీ ప్రసార హక్కులపై జరుగుతున్న ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవి. ఇలాంటి నమ్మొద్దు, ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరని కోరుతున్నాం” అని వరుణ్ తేజ్ టీం స్పష్టం చేసింది. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.