ఇటీవల విడుదలయిన ‘కంచె’ సినిమా అందులో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కి, ఆ సినిమాకి దర్శకత్వం వహించిన క్రిష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. వారిరువురు మళ్ళీ మరో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకి ‘రాయబారి’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ఆ పేరును ఈ మధ్యనే ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నాడు కూడా. ఆ సినిమా రొటీన్ తెలుగు సినిమాలకి పూర్తి భిన్నంగా ఒక రహస్య గూడఛారి కధని క్రిష్ సిద్దం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తామని దర్శకుడు క్రిష్ తెలిపారు.