‘కంచె’ చిత్రంలో వరుణ్ తేజ్ సైనికుడిగా కనిపించాడు. అందులో చాలా ఫిట్ గా ఉన్నాడు. తరవాత ‘లోఫర్’ సినిమా కోసం మరింత సన్నబడ్డాడు. ‘మిస్టర్’ తరవాత నటించిన చిత్రాల్లో బొద్దుగా కనిపించాడు. ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్ 2’ చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఆరడుగుల ఎత్తు ఉండడం వల్ల బావున్నాడు. ‘మిస్టర్’ చిత్రీకరణ సమయంలో కాలికి గాయం కావడం, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల వరుణ్ తేజ్ లావయ్యాడు. ఈ మధ్య చేసిన సినిమాల్లో అతడికి ఫిజిక్ పరంగా పరీక్ష పెట్టిన పాత్రలేవీ లేవు. దాంతో ఏ సమస్యా లేదు. ఇప్పుడు వచ్చింది. అందుకని, బరువు తగ్గాలనుకుంటున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థలో చేయనున్న సినిమా కోసం వరుణ్ తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘అంతరిక్షం’ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసిన కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్. బాక్సర్ అంటే ఫిట్‌గా కనిపించాలి. అందువల్ల బరువు తగ్గాలనుకుంటున్నాడు. అలాగే, బాక్సింగ్ లో శిక్షణ తీసుకోవడానికి అమెరికా వెళ్తున్నాడు. పనిలో పనిగా అక్కడే బరువు తగ్గే కార్యక్రమం పెట్టుకున్నాడట.