తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు ఎప్పటి నుంచో హీరోయిన్ల సమస్య ఉంది. తమ సినిమాల్లో నటించడానికి సరైన స్టార్ హీరోయిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు దూరంగా సినిమాలు చేయడానికి వెంకటేష్ ఎప్పుడో ప్రిపేర్ అయ్యారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కొత్త సమస్యల వస్తోంది. ఆయనతో నటించడానికి యంగ్ హీరోలు అంత త్వరగా ‘యస్’ చెప్పడం లేదు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి మంచి మల్టీస్టారర్ కథ ‘ఎఫ్2’ను వెంకీకి చెప్పి ఓకే చేయించుకున్నాడు. అందులో మరో హీరోగా చేయమని ముందు నానిని అడిగారు. ఆల్రెడీ నాగార్జునతో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా సినిమా చేస్తున్నా. వెంటనే మరో మల్టీస్టారర్ చేయలేలని సున్నితంగా తప్పుకున్నాడు. తర్వాత ప్రపోజల్ మెగా హీరో వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్ళింది. ఆల్మోస్ట్ వరుణ్ కన్ఫర్మ్ అని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. కానీ, వరుణ్ మాత్రం అదేం లేదంటున్నాడు.
‘అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ పడుతుంది. అనిల్ లైన్ చెప్పాడు అంతే. పూర్తి కథ చెప్తే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు’ – ‘తొలిప్రేమ’ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ లో వరుణ్ తేజ్ చెప్పిన మేటర్ ఇది. ‘ఎఫ్2’ చేస్తున్నానని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, చేయడం లేదని రెడ్ సిగ్నల్ వేయలేదు. అటూ ఇటూ కాకుండా ఎల్లో సిగ్నల్ వేసి అనిల్ రావిపూడిని వెయిటింగ్ లో ఉంచాడు. అనిల్ రావిపూడి కథతో మెప్పిస్తాడో? లేదో?