హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న లోఫర్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమయింది. పూరి గత చిత్రం జ్యోతిలక్ష్మి నిర్మించిన సి.కళ్యాణే లోఫర్నుకూడా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పతాని హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టులో షూటింగ్ పూర్తవుతుందని, సెప్టెంబర్‌లో విడుదల చేస్తారని సమాచారం. ముకుందతో తెరంగేట్రం చేసిన వరుణ్, ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో కంచె అనే సినిమాను చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాబట్టి లోఫర్ వరుణ్ మూడవ చిత్రం అవుతుందని తెలుస్తోంది. మరోవైపు, మరో కొత్త రోజు, కొత్త ప్రారంభం, పూరి జగన్నాథ్, కళ్యాణ్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని, మీ ప్రేమాభిమానాలు కావాలంటూ వరుణ్ సోషల్ మీడియాలో ఇవాళ పోస్ట్ చేశారు.