ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్. రెండు సినిమాలు ప్రత్యేక కథా కథనాలతో తీసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం లోఫర్ సినిమా చేస్తున్నాడు. పూర్ మార్క్ కథనంతో వస్తున్న ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే ఈ సినిమా అయ్యాక మరో భారీ సినిమానే చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు ఈ హీరో..
కంచె తర్వాత ఊపందుకున్న వరుణ్ తేజ్ సినిమాల హడావిడిలో లోఫర్ ఈ నెలే వస్తుండగా.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. అది పూర్తి కాకముందే దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో మరో సినిమా కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు మెగా హీరో. ‘ఫీల్ మై లవ్’ అంటూ వస్తున్న ఈ సినిమాతో వెంకీ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. స్నేహగీతం సినిమాలో స్నేహితుల్లో ఒకరి పాత్రలో నటించిన వెంకీ ఈ సినిమాను దర్శకత్వం వహించడం విశేషం.
సుకుమార్ ఆర్య సినిమాలో అల్లు అర్జున్ వాడిన పదం ఫీల్ మై లవ్.. సినిమా కథాంశం మొత్తం ఈ పదంలోనే వచ్చేలా చేశాడు సుకుమార్. మరి ఇప్పుడు ఆ టైటిల్ తో వస్తున్న వరుణ్ తేజ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.