మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఉందో లేదో తెలియదు .. ఆ పదవిని కాపాడుకోవాలంటే వైసీపీ మార్క్ బూతు లాంగ్వేజ్ ను ప్రయోగించకపోతే.. అంతే సంగతులని అర్థమయిందేమో కానీ పవన్ కల్యాణ్‌పై ప్రెస్ మీట్ పెట్టేశారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేశారు. పవన్ కల్యాణ్ ఎదురుగా వస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందని.. కానీ సభ్యత ఉందని నోటీసులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా?, మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనిపిస్తే.. ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నాం.. అంటూ ఆవేశపడిపోయారు. వాడు, వీడు అంటూ రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించీ మాట్లాడారు.
ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అంటాడు. సినీ రాజకీయ నాయకుల తీరుపై చర్చ జరగాలన్నారు. మహిళా కమిషన్‌కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని.. మహిళల సమక్షంలో రచ్చబండకు పవన్ కళ్యాణ్ రావాలని సవాల్ చేశారు. వాసిరెడ్డి పద్మ మాటల తీరు చూసి.. వైసీపీలో ఎవరికైనా బూతులందుకుటే తప్ప పదవులు గ్యారంటీ ఉండదన్న సంకేతాలు పంపినట్లేనని క్లారిటీ వస్తోంది.
అయినా పవన్ కల్యాణ్‌ను.. ప్రతిపక్ష నేతల్ని తిట్టడానికి .. మహిళా నేతల్ని పంపుతూండటం.. విస్మయకరంగా మారింది. దీనివల్ల వైసీపీకి ఎంత మేలు జరుగుతుందో కానీ.. తర్వాత ఆ మహిళా నేతలు మాత్రం..తీవ్ర అవమానాలకు గురవుతారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.