ఏ వ్యవస్థనైనా రాజకీయం కోసమే వాడుకోవడం వైసీపీ స్టైల్. అది పోలీసు దగ్గర నుంచి మహిళా కమిషన్ వరకూ అదే పరిస్థితి. నిజంగా మహిళలకు అన్యాయం జరిగిన చోట అసలు స్పందనే ఉండని మహిళా కమిషన్.. ఎవరైనా టీడీపీ నేతలో.. జనసేన నాయకులో.. సాధారణంగా మాట్లాడినా సరే వాటికి క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపిస్తున్నారు. అవి వివాదాస్పద వ్యాఖ్యలు అని సీఎం జగన్‌కు అనిపించాలి అంతే.
మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చట్ట ప్రకారమే విడాకులు తీసుకున్నానన్నారు. కావాలంటే మీరూ చేసుకోండని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఈ ఈ వ్యాఖ్యలు సీఎం జగన్‌కు తప్పనిపించాయి. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నారు పవన్.. సమాజం ఏమైపోవాలని అని బహిరంగసభలో బాధపడ్డారు. జగన్ బాధను అర్థం చేసుకున్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వెంటనే .. పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు. తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నోటీసుల్ని చూసి.. సామాన్యులు కూడా .. అబ్బా .. ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నరా.ు
పవన్‌కు వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులో మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ..మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం ఆక్షేపణీయం అని మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. లేకపోతే ఏం చేస్తారో చెప్పలేదు. గతంలో ఓ బాలిక అత్యాచారానికి గురైతే.. రెండు రోజులు పట్టించుకోలేదు. మూడో రోజు చంద్రబాబు పరామర్శకు వెళ్లే సమయంలో .. ఆస్పత్రిలో ఉండి నానా రచ్చ చేశారు. తర్వాత రివర్స్‌లో చంద్రబాబుకు నోటీసులిచ్చారు. కానీ నిజంగా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజులకిందట కూడా నెల్లూరులో ఓ యువతి గొంతు కోశారు. ఇలాంటి కేసులు రొటీన్ అయిపోవడంతో పట్టించుకవడం కూడా తగ్గిపోయింది. కానీ వాసిరెడ్డి పద్మ మాత్రం రాజకీయంగా ఎవరికి నోటీసులివ్వాలని.. అనే అంశాల్లో బిజీగా ఉంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.