జగన్మోహన్ రెడ్డి తన సమస్యల పరిష్కారానికి తాయత్తుల పరిష్కారం ఎవరు చెప్పినా రెడీ అయ్యేలా ఉన్నారు. ఓడిపోవడానికి వాస్తు సమస్యలే కారణం అని ఎవరో చెప్పడంతో అదే నిజమనుకుని ఇంటికి బొక్కలు పెట్టేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఓ రోజు ప్రచారం ఆపేశారు. ఎందుకంటే తన ఇంటికి చుట్టూ పెట్టించుకున్న ఇనుప గ్రిల్స్ కు ఓ చోట బొక్క పెట్టించారు. ఈశాన్యం మూల నుంచి గాలి రావాలని అలా ఉండకూడదని చెప్పడంతో అలా చేయించారు. తరవాత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఓ వైపు ఇనుప కంచెకు బొక్క అలాగే ఉంది.
ఇప్పుడు మరో వైపు కూడా బొక్క పెట్టాలని సలహా ఇవ్వడంతో అదే పని చేస్తున్నారు జగన్. దక్షిణం వైపు నుంచి ఇసుక కంచెకు బొక్కలు పెట్టిస్తున్నారు. రేపు మరో చోట పెట్టిస్తారేమో తెలియదు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అవి ప్రజాధనంతో పెట్టించుకున్నారో వాటిని వాస్తు మార్పుల పేరుతో పట్టించుకోవడం లేదు. జగన్ రెడ్డి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ప్రజాధనంతో కొనుగోలు చేసిందే. ఏ మాత్రం సిగ్గు లేకుండా వాటిని ఓడిపోయిన తర్వాత కూడా వాడుకుంటూనే ఉన్నారు.
ప్రైవేటు నివాసానికి ప్రజాధనంతో సోకులు చేయించుకునే ముఖ్యమంత్రి జగన్ఒక్కరే. ఆయన ఇంట్లో ఉన్న ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి వస్తువును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఎందుకో పట్టించుకోవడం లేదు. డబ్బులు కడతామని అప్పిరెడ్డి లాంటి వారితో చెప్పిస్తున్నారు. కానీ నిజంగా కట్టేవారు అయితే అప్పిరెడ్డిలతో ఏం పని.. నేరుగా అధికారవర్గాలకే జీవోల ప్రకారం చూసి డబ్బులు పంపేవారు కదా!