వాళ్లిద్దరూ వైసీపీ ఎమ్మెల్యేలు. వాళ్ల గొడవలున్నాయి. అయితే కులాల పేరుతో తిట్టుకుంటారా అంటే.. .. వైసీపీలో అదే జరిగేదని మరోసారి నిరూపించుకున్నారు. విజయవాడలో బొప్పన భవకుమార్ అనే నాయకుడు తన పుట్టిన రోజును వైసీపీ నేతంలదర్నీ పిలిచి ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. అలా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును… మాజీ మంత్రి , ఎమ్మెల్యే వెల్లంపల్లిని కూడా పిలిచారు. మిగతా వారితో పాటు వారు కూడా వచ్చారు. భవకుమార్ ఇంట్లో అందరూ విందులో ఉంటూ మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలో అటు వెల్లంపల్లి, ఇటు ఉదయభాను ఒక్క సారిగా తిట్టుకోవడం ప్రారంభించారు. వారి మధ్య కులాల తిట్లు అసువుగా వచ్చేశాయి. బండ బూతులు తిట్టుకున్నారు. మధ్యలో కాపు రౌడీలు అంటూ వెల్లంపల్లి మాట్లాడారు. ఈ వ్యవహారం చొక్కాలు పట్టుకునే వరకూ వచ్చింది. కొట్టుకున్నారో లేదో తెలియదు కానీ… విషయం అంత వరకే బయటకు వచ్చింది. తర్వాత జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో వెల్లంపల్లి కనిపించలేదు. ఉదయభాను ఒక్కరే పాల్గొన్నారు.
ఇటీవల ఉదయభాను .. తన అనుచరుల్ని జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఇలా వెళ్లిన వాళ్లలో వెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన వారు ఉన్నారు. వారిని ఎందుకు తీసుకెళ్లావని వెల్లంపల్లి ఫ్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. కొట్టుకునే వరకూ వెళ్లిందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తిట్టుకోవచ్చు.. కొట్టుకోవచ్చు… కానీ మధ్యలో కులాల ను ఎందుకు తెచ్చుకుంటున్నారన్నది వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. ప్రతిపక్షం మీద చేసి చేసి.. ఇప్పుడు వారిలో వారు కూడా కులాల సమరం చేసుకుంటున్నారన్న విస్మయం వ్యక్తమవుతోంది.
కొసమెరుపేమిటంటే… కాపు రౌడీలు అన్నందుకు వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలని… ఓ కుల సంఘం మీడియా ప్రకటన ఇచ్చేసింది.. హతవిధీ..!?