అ.ఆలో పాటలన్నీ ఓకే ఓకేగా సాగాయి. వెళ్లిపోకే శ్యామలా మాత్రం అ.ఆ ఆడియోకే సూపర్ హిట్ గా నిలిచింది. కథానాయకుడు అనసూయ అని పాడుకోవాలి గానీ, ఈ శ్యామల ఏంటి? అని ఆడియన్ కాస్త కన్ ఫ్యూజ్ అయినా.. ఆ పాట బాగుండడంతో ఆ లోపం కూడా తెలియలేదు. తెరపై ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్టు అనిపించిన ఆ పాటకు అక్షరాలా కోటిన్నర ఖర్చయ్యిందట. చార్మినార్ సెట్ వేసి, అక్కడ వాతావరణాన్ని మళ్లీ రీ క్రియేట్ చేసి.. ఈ పాటని తీశారు.
అయితే చార్మీనార్ మన హైదరాబాద్‌లోనే ఉండగా, ఈపాట కోసం మళ్లీ సెట్ ఎందుకు వేయాల్సివచ్చిందో? ఆ పాటని రోడ్డుపై తీసినా బాగానే ఉంటుంది. అందుకోసం కోటిన్నర సెట్ వేయడం వెనుక మర్మమేమిటో అర్థం కాదు. దాంతో పాటు బ్రిడ్జిపై ఓ ఫైటుని సీజీ వర్క్‌తో తీశారు. అదీ అడిషనల్ ఖర్చే. రాధాకృష్ణలాంటి నిర్మాతతోడుంటే త్రివిక్రమ్ ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడు. అందుకే.. అఆలో పాట, ఫైటుపై అంతలా ఖర్చు పెట్టారేమో.